: చంద్రబాబుపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు
ఢిల్లీ ఏపీభవన్ అధికారులు తమ పట్టు వదలడం లేదు. నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వారు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీ భవన్ నుంచి బాబు వెళ్ళిపోవాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. బాబు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత పొందుతున్నారని, ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు భద్రతపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, అందుకే తాము బాబును దీక్షా వేదికను తరలించమంటున్నామని వివరించారు.