: సమైక్య ఉద్యమం కోసం కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ


సమైక్యాంధ్ర ఉద్యమం కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో 17 మంది సభ్యులున్నారు. వీరిలో మంత్రులు రఘువీరా, ఆనం, టీజీ వెంకటేష్, పార్థసారథి, కొండ్రు మురళి, బాలరాజు, శైలజానాథ్, తోట నర్సింహం, అహ్మదుల్లాతో పాటు ఎమ్మెల్యేలు ఆనం వివేకా, నాగేశ్వరరావు, అప్పలనర్సయ్య, కన్నబాబు, విజయకుమార్, కమల, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు ఉన్నారు. మరో రెండ్రోజుల్లో ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కమిటీ సమన్వయకర్త శైలజానాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News