: ఎయిరిండియా బోయింగ్ విమానాలు కొననున్న ఎతిహాద్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఎతిహాద్ ఎయిర్ వేస్.. ఎయిరిండియా సంస్థకు చెందిన బోయింగ్ విమానాలు కొనుగోలు చేయనుంది. ఐదు బోయింగ్ 777-200 రకం విమానాలను కొనుగోలు చేయడానికి ఇరు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరినట్టు ఎతిహాద్ ఎయిర్ వేస్ తెలిపింది. ఈ విమానాలను 2014 ప్రారంభంలో అప్పగించేలా అగ్రిమెంట్ చేసుకున్నట్టు వెల్లడించింది. ఈ విమానాలను తమ కొత్త రూటైన అబుదాబి- లాస్ ఏంజెల్స్ మధ్య నడుపుతామని తెలిపింది. వీటి రాకతో తమ మొత్తం విమానాల సంఖ్య 87కు చేరుకుంటుందని ఎతిహాద్ ప్రకటించింది.