: తుపాన్ హెచ్చరికలతో ఒడిశా అప్రమత్తం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఒడిశాలో తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించడంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాలతో సహా మొత్తం 14 జిల్లాల కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తుపాను వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయడం.. తదితర విషయాలపై సత్వర చర్యలు చేపట్టవలసిందిగా ఒడిశా ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు సూచించింది.