: ఎమ్మెల్యే భార్య హత్య
ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే హాజీ అలీం భార్య రెహానా(40) హత్యకు గురయ్యారు. తూర్పు ఢిల్లీలోని నివాసంలో ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం హత్య చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. అయితే తెలిసినవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రెహానా హత్యకు గురైన సమయంలో హాజీ అలీం ఇంట్లో లేరు. ఆయన హజ్ యాత్రలో ఉన్నారు. ఈయన ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహార్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.