: శాంసంగ్ నుంచి ప్రపంచంలో తొలి కర్వ్డ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్
ఇప్పటి వరకూ మనం భిన్న రకాల మొబైల్ స్క్రీన్లను చూసి ఉన్నాం. కానీ, వంపు(కర్వ్ డ్) తిరిగిన స్క్రీన్ తో ప్రపంచంలోనే తొలి స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ విడుదల చేసింది. గెలాక్సీ శ్రేణిలోనే దీనినీ విడుదల చేసింది. దీని వల్ల ఒక చక్కటి సౌలభ్యం ఉంది. ఫోన్ కిందపడినా స్క్రీన్ బ్రేకయ్యే అవకాశాలు తక్కువ. ఎందుకంటే స్క్రీన్ లోపలకు వంగి, అటూ ఇటూ అంచులు పైకి ఉంటాయి. పగలడానికి వీల్లేని గాడ్జెట్ల తయారీలో ఇదొక ముందడుగు అని విశ్లేషకుడు నామ్ డైజాంగ్ అన్నారు.
5.7 అంగుళాల కర్వ్డ్ స్క్రీన్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ బరువు గెలాక్సీ నోట్ 3 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. ఫ్లాట్ స్క్రీన్ ఫోన్ల కంటే దీనిపై గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. స్క్రీన్ ఆఫ్ అయి ఉన్నా మిస్డ్ కాల్స్, బ్యాటరీ పవర్ ఎంతుందన్న వివరాలను తెలుసుకునే సౌలభ్యం ఉంది. ప్రస్తుతానికి ఈ విలక్షణ ఫోన్ దక్షిణ కొరియాలోనే అందుబాటులో ఉంది.