: టెస్ట్ క్రికెట్ కు దిల్షాన్ గుడ్ బై


శ్రీలంక ఓపెనర్, మాజీ కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు మీడియాకు తెలిపింది. రేపు తన రిటైర్మెంట్ విషయాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా దిల్షాన్ అధికారికంగా ప్రకటిస్తాడని బోర్డు ప్రకటించింది. ఆటకు వీడ్కోలు విషయమై దిల్షాన్ మాట్లాడుతూ.. మరో యువ క్రెకెటర్ కు టీంలో చోటు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. 'జింబాబ్వే సిరీస్ తర్వాత వైదొలుగుదామని ఇంతకు ముందు అనుకున్నా... కానీ, సిరీస్ వాయిదాపడడంతో ఇప్పుడే ఆ పని చేస్తున్నా'అని దిల్షాన్ తెలిపాడు. అయితే, వన్డేలు, టీ20 పోటీలలో దిల్షాన్ తన ఆటను కొనసాగించనున్నాడు. సెలెక్టర్లు కోరితే 2015 వరల్డ్ కప్ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని తెలిపాడు.

తనదైన షాట్లతో బౌలర్ల మీద విరుచుకుపడే దిల్షాన్... 1999లో బులవాయోలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. 14 ఏళ్ల ప్రస్థానంలో దిల్షాన్ 87 టెస్టు మ్యాచుల్లో 40.98 సగటుతో 5,492 రన్స్ చేశాడు. మొత్తం 16 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. ఇంగ్లండ్ పై 193 పరుగులు చేసి తన కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. అంతే కాకుండా బౌలర్ గా 39 వికెట్లు పడగొట్టాడు.

  • Loading...

More Telugu News