: అక్కడ గర్భవతులకు ఉచిత ప్రయాణం
గర్భవతులను ఉచితంగా ఆసుపత్రి వరకూ తీసుకెళ్లి ప్రసవానంతరం తిరిగి ఇంటి వద్ద దిగబట్టే సేవలను కర్ణాటక ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గర్భవతులు తమ పేరు, ఫోన్ నంబర్లను వైద్యాధికారుల వద్ద నమోదు చేసుకుంటే చాలు. డెలివరీ తేదీకి ముందే వాహనం వచ్చి గర్భిణులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళుతుంది. ప్రసవానంతరం వైద్యుల సూచనను అనుసరించి అదే వాహనం తీసుకెళ్లి వారింటి వద్ద దిగబెడుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలలో గర్భవతులకు వేగవంతమైన వైద్య సాయం అందుతుందని భావిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు కురిపించడానికీ ఇది తోడ్పడుతుందని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.