: గ్యాస్ లీకేజి ఘటనపై విచారణకు ఆదేశం
నెల్లూరు జిల్లాలోని జేజీ పేట రొయ్యల పరిశ్రమలో అమ్మోనియం గ్యాస్ లీకేజీ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన కంపెనీని మూసివేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలో గ్యాస్ లీకై 50 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.