: కేంద్ర మంత్రుల బృందం కుదింపు.. పళ్ళంరాజు తొలగింపు


రాష్ట్ర విభజన అంశంపై కేంద్రం ప్రకటించిన కేబినెట్ మంత్రుల బృందాన్ని కుదించారు. తొలుత తొమ్మిది మంది మంత్రులతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికీ ఈ బృందంలో చోటు కల్పించారు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో సభ్యుల సంఖ్యను ఏడుకు కుదించారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్ నిర్ణయం తీసుకున్నారు. అధిష్ఠానంపై గుర్రుగా ఉంటోన్న కేంద్ర మంత్రి పళ్ళంరాజును ఈ బృందం నుంచి తొలగించారు. అంతేగాకుండా మరో ఐదుగురు మంత్రులను, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని కూడా తొలగించారు. వీరిస్థానంలో మరో నలుగురిని తీసుకున్నారు. ఈ బృందానికి ఏకే ఆంటోనీ నాయకత్వం వహిస్తారు.

  • Loading...

More Telugu News