: దినేశ్ రెడ్డి తప్పు చేశారు: నారాయణ
ముఖ్యమంత్రిపై మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. దినేశ్ రెడ్డి వ్యాఖ్యలు పాలనాపరమైన క్రమశిక్షణ నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని అన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా... డీజీపీ ముఖ్యమంత్రిని విశ్వాసంలోకి తీసుకుని పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. పాలనలో భాగంగా ఎన్నో రహస్యాలను పంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. డీజీపీగా పదవీకాలం పొడిగింపును ఆశించిన దినేశ్ రెడ్డి అది లభించకపోవడంతోనే ఈ విధంగా మాట్లాడినట్టు అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. దీనికితోడు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పదవీ విరమణ తర్వాత ఐదేళ్ల పాటు ఏ రాజకీయ పార్టీలో చేరకుండా నిబంధనలను తయారుచేయాలని సూచించారు. సీఎం కిరణ్ తమ్ముడి వ్యవహారంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని నారాయణ పేర్కొన్నారు.