: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా లండన్ లో ధర్నా
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూరప్ లోని ఆంధ్రులు ఏకమవుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు ఈ నెల 12న లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అనుమతి కూడా తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 1.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా ఉంటుందని, ఈ కార్యక్రమంలో సమైక్యవాదులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.