: కాసేపట్లో సీఎంతో ఏపీఎన్జీవోల చర్చలు
నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె నేపథ్యంలో.. ముఖ్యమంత్రితో ఏపీఎన్జీవోలు మరికాసేపట్లో భేటీ కాబోతున్నారు. ఎంతో కీలకమైన ఈ భేటీకి ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు హాజరవుతున్నారు. కాగా, సీఎం నుంచి స్పష్టమైన హామీ లభిస్తేనే సమ్మె విరమిస్తామని ఉద్యోగులు తెలిపారు. హామీ లభించకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఈ భేటీలో సమైక్యాంధ్రనే తమ సింగిల్ అజెండా అని ఉద్యోగులు అంటున్నారు. దీంతో చర్చల తర్వాత ఉద్యోగుల నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రి వర్గ ఉపసంఘంతో ఇప్పటికే రెండుసార్లు ఉద్యోగులు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపలేకపోయాయి. మరోవైపు, విద్యుత్ జేఏసీతో చర్చలు కూడా విఫలమైన సంగతి తెలిసిందే.