: గ్యాస్ లీకై 50 మందికి అస్వస్థత
నెల్లూరు పట్టణం సమీపంలో ఇందుకూరిపేట మండలంలోని జేజీ పేట వద్ద ఉన్న స్టార్ హేచరీస్ (రొయ్యల పరిశ్రమ)లో గ్యాస్ లీకేజీ కారణంగా 50 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హేచరీస్ లో ప్రమాదవశాత్తూ అమ్మోనియా లీకైందని తెలుస్తోంది. కాగా, అస్వస్థతకు గురైన మహిళలను నెల్లూరులోని రామచంద్రారెడ్డి ఆసుపత్రికి, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.