: బాబు దీక్షకు అసోం గణపరిషత్ మద్దతు


తెలుగు ప్రజలకు న్యాయం చేయాలంటూ గత మూడు రోజులుగా ఢిల్లీలో నిరవధిక దీక్షకు దిగిన చంద్రబాబు నాయుడుకు జాతీయస్థాయిలో మద్దతు పెరుగుతోంది. బాబుకు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. తొలిరోజు బాబు దీక్షకు పలు జాతీయ పార్టీల నేతలు మద్దతు తెలుపగా, తాజాగా అసోం గణపరిషత్(ఏజీపీ) నేత ప్రపుల్ కుమార్ మహంతా దీక్షా శిబిరాన్ని సందర్శించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ, ఎన్టీఆర్ హయాం నుంచి ఏజీపీతో టీడీపీకి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు.

  • Loading...

More Telugu News