: అనుకూలమని చెప్పినవారే మాట మారిస్తే ఏం చేస్తాం?: దిగ్విజయ్


ఇంతకుముందు తెలంగాణకు అనుకూలమని చెప్పిన చంద్రబాబు, జగన్ ఇప్పుడు మాట మారిస్తే తామేం చేస్తామని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. వారు కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తామని కూడా చెప్పారని తెలిపారు. నిర్ణయం తీసుకోవాలని ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు కోరారని ద్విగ్విజయ్ అన్నారు. పార్టీకోసం వైఎస్ ఎంతో చేశారని, జగన్ తనకు కొడుకులాంటివాడని డిగ్గీ రాజా చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. ఇక, రాజీనామాపై హైకోర్టుకు వెళ్లే హక్కు లగడపాటికి ఉందన్నారు. అటు, రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానన్న ఆయన, ఉదయమే సీఎం కిరణ్ తో మాట్లాడానన్నారు. అత్యవసర సర్వీసుల కోసం విద్యుత్ పునరుద్ధరించినట్లు చెప్పారని.. సమ్మె విరమణ కోసం ఏపీఎన్జీవోలతో చర్చలు జరుగుతున్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News