: నిర్ణయం కాంగ్రెస్ ఇష్టమేనా?: చంద్రబాబు


రాష్ట్ర విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష సందర్భంగా ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంపై నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ ఇష్టమేనా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎవరూ పెద్దమనుషులు లేరా? వారి పార్టీ నిర్ణయం చెప్పకుండా విభజన నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబని ఆయన నిలదీశారు. 'నాపై కక్షతో తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టొద్దు' అని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. తెలుగు ప్రజలకోసం నిర్మించిన ఏపీ భవన్ లోకి తెలుగువారిని అనుమతించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చాలా జఠిలమైన సమస్య అని దీన్ని పరిష్కరించేందుకు జాతీయ నేతలు, మీడియా సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్లు తెరిచి పద్ధతి ప్రకారం సమస్యను పరిష్కరించాలని బాబు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News