: వియత్నాంలో రెండు టన్నుల ఏనుగు దంతాల సీజ్
వేటగాళ్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏనుగు జాతికి పెద్ద ఎత్తున ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఏనుగుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాయి. వేటపై నిషేధాన్ని కూడా అమలు చేస్తున్నాయి. అయినా వేటగాళ్లు గజరాజులను వదిలి పెట్టడం లేదు. దంతాల కోసం వధిస్తూనే ఉన్నారు. తాజాగా వియత్నాంలో మలేసియా నుంచి దిగుమతి అయిన రెండు టన్నుల (2000 కేజీలు) ఏనుగు దంతాలను అధికారులు పట్టుకున్నారు. ఉత్తర ఓడరేవు పట్టణం హాయ్ పోంగ్ లో కస్టమ్స్ అధికారులు వీటిని పట్టుకున్నారు. ఏనుగు దంతాలతో ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు తయారు చేస్తుంటారు. ప్రపంచ మార్కెట్లో వీటి ఖరీదు చాలా ఎక్కువ.