: ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
రాష్ట్ర విభజనను నిరసిస్తూ విశాఖ జిల్లా మద్దిలపాలెం ఆర్టీసీ డిపో కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ కు చెందిన కార్మికులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. దాదాపు 300 మంది కార్మికులు సిటీ డిపో నుంచి జాతీయ రహదారి మీదుగా సత్యం కంప్యూటర్స్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సమైక్య నినాదాలు చేశారు.