: నాంపల్లిలో ప్రమాదానికి గురైన ఎంఎంటీఎస్ రైలు
నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం తప్పింది. స్టేషన్ లోని రెండో నంబర్ ప్లాట్ ఫాంలో లింగంపల్లి-ఫలక్ నుమా ఎంఎంటీఎస్ రైలు డెడ్ ఎండ్ ను ఢీకొని ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. బ్రేకులు ఫెయిలవడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమైంది. సహాయక కార్యక్రమాలు చేపట్టిన రైల్వే అధికారులు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను కాపాడారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు స్పల్పంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.