: గొడవలు కూడా వంశపారంపర్యమేనట!


సాధారణంగా వైవాహిక జీవితంలో కొందరికి ఆనందాలు, మరికొందరికి వివాదాలు వస్తుంటాయి. ఇలా ఆనందాలైనా, వివాదాలైనా అన్నీ కూడా వంశపారంపర్యంగా వస్తాయట. ఆశ్చర్యంగా ఉన్నా నిపుణులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. మనలోని డీఎన్‌ఏ కీలకమైన పాత్రను పోషించడం వల్ల మన వైవాహిక జీవితంలో ఆనందాలైనా, వివాదాలైనా చోటుచేసుకుంటాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు.

నార్త్‌ వెస్ట్రన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో మనలోని డీఎన్‌ఏ మన వైవాహిక జీవితంలో సంతోషాలు లేదా ఘర్షణలకు దారితీయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. జన్యుశాస్త్రంలో భావోద్వేగాలకు, వైవాహిక సంతృప్తికి మధ్య సంబంధాన్ని గుర్తించిన మొట్టమొదటి అధ్యయనం ఇదేనని పరిశోధకులు భావిస్తున్నారు. మనలోని డీఎన్‌ఏ కారణంగా మన వైవాహిక జీవితంలో సంతోషాలు, లేదా ఘర్షణలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మనలోని 5-హెచ్‌టీటీఎల్‌పీఆర్‌ అనే జన్యు రకానికి వైవాహిక బంధంలో తృప్తికి మధ్య సంబంధం ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఒకటి లేదా రెండు జన్యురకాలూ పొడవుగా ఉన్నవారు వివాహబంధంలోని భావోద్వేగాలకు పెద్దగా స్పందించరని ఈ పరిశోధనలో తేలింది. వందమంది వాలంటీర్లపై జన్యుపరమైన పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు.

  • Loading...

More Telugu News