: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ తెలంగాణలో ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాదు నుంచి తెలంగాణలోని ముఖ్య ప్రాంతాలకు 1840 ప్రత్యేక బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఈ బస్సులు నడుస్తాయని ఆయన చెప్పారు. ఈ సర్వీసులకు రిజర్వేషన్ సదుపాయం ఉంటుందని, 50 శాతం అదనపు చార్జీని వసూలు చేస్తామని వెల్లడించారు.