: కోఠిలో ఎస్ బీఐని ముట్టడించిన ఏపీఎన్జీవోలు
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీఎన్జీవోలు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. బ్యాంక్ ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది.