: దినేశ్ రెడ్డికి దిగ్విజయ్ సూటి ప్రశ్న
మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ సూటిగా ప్రశ్నించారు. దినేశ్ రెడ్డి పదవిలో ఉండగానే ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయాల్సిందన్నారు. సీఎంపై చేసిన ఆరోపణలను దినేశ్ రెడ్డి నిరూపించగలరా? అని సవాలు విసిరారు. ఇక విభజన అంశంపై మాట్లాడుతూ, టీడీపీ లిఖితపూర్వకంగా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించినందునే తాము తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని.. ఇప్పుడు చంద్రబాబు దీక్ష చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని దిగ్విజయ్ అభిప్రాయపడ్డారు.