: విజయసాయిరెడ్డికి బెయిల్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితులందరూ వరుసగా ఒక్కొక్కరూ బెయిల్ పై బయటపడుతున్నారు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. రూ.2 లక్షల చొప్పున ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. కేసు విషయమై ఎవరితోనూ చర్చించకూడదని, అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదన్న షరతులతో బెయిల్ ఇచ్చింది. తొలుత అరెస్టయిన తర్వాత మధ్యలో రెండుసార్లు బెయిల్ పై బయటికొచ్చిన విజయసాయి మళ్లీ జైలుకెళ్లారు. దాంతో, నాలుగు నెలల నుంచి ఆయన చంచల్ గూడ జైల్లో ఉంటున్నారు.