: సీఎస్ ను కలిసిన టీడీపీ నేతలు
కొద్ది సేపటి క్రితం తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో సచివాలయంలో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో చంద్రబాబు చేస్తున్న దీక్షకు అనుమతి లేదన్న కారణంతో దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని అధికారులు నోటీసు ఇవ్వడంపై వారు సీఎస్ కు ఫిర్యాదు చేశారు.