: ప్రాణం పోయినా లెక్క చేయనంటున్న చంద్రబాబు


తెలుగు ప్రజల కోసం చేసే పోరాటంలో ప్రాణం పోయినా లెక్క చేయనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలోని దీక్షా ప్రాంగణం నుంచి ఆయన మాట్లాడుతూ.. అందరితో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపకపోతే పరిస్థితుల తీవ్రత పెరుగుతుందని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ కుట్రను ఎండగట్టేందుకే తాను ఢిల్లీలో దీక్ష చేపట్టినట్టు తెలిపారు. దీక్షకు అనుమతి లేదని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ నోటీసులు కూడా ఇచ్చారని వెల్లడించారు.

టీడీపీని దెబ్బ తీయాలన్న కోరిక తప్ప, సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశం కాంగ్రెస్ కు లేదని చంద్రబాబు ఆరోపించారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలతో కుమ్మక్కయిన కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ ను రావణకాష్టంలా మార్చిందని మండిపడ్డారు. తక్షణం రెండు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News