: నరికేస్తానంటున్న తారా చౌదరి


తారా చౌదరి.. ఈ పేరు వింటే కొందరు ప్రముఖుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. ఎందుకంటే, వారి చీకటి భాగోతాలకు ఏర్పాట్లు చేసేది ఆమె కాబట్టి, వారి గుట్టుమట్లన్నీ ఆమె గుప్పిట్లో ఉంటాయి కాబట్టి. అమాయకమైన యువతులకు గాలం వేసి, వారిని వ్యభిచార కూపంలో దించి, వారిని ప్రముఖులకు ఎరగా వేసిందన్న ఆరోపణలపై ఇంతకుముందోసారి అరెస్టయింది కూడా ఈ తార. బెయిల్ పై బయటికొచ్చిన వెంటనే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళకు మళ్ళీ తెరమీదికొచ్చింది. ఓ స్కార్పియో వాహన కొనుగోలు వివాదంలో తన తమ్ముడు భాస్కర్ ను కిడ్నాప్ చేశారంటూ ఆమె గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ వాహనం తన బావ పేరిట ఉన్నా, రుణ వాయిదాలను తానే చెల్లిస్తున్నానని తెలిపింది.

ఆ వాహనం తమదేనని స్పష్టం చేసిన తారా చౌదరి, తన బావతో ఇదే విషయమై వివాదం తలెత్తిందని పేర్కొంది. దీనిపై ఫిర్యాదు చేస్తే వినుకొండ సీఐ బాలసుబ్రమణ్యం పట్టించుకోవడంలేదని ఆరోపించింది. ఈ క్రమంలో తన సోదరుడిని బావే కిడ్నాప్ చేయించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సోదరుడి ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ఊరుకోనని, నడిరోడ్డుపై నరికేస్తానని మీడియా సాక్షిగా చిందులేసింది. కాగా, తారా చౌదరి ఫిర్యాదును పరిశీలిస్తున్నామని వినుకొండ సీఐ బాలసుబ్రమణ్యం చెప్పారు.

  • Loading...

More Telugu News