: మల్లాది చంద్రశేఖర శాస్త్రికి 'రామినేని' పురస్కారం


ప్రముఖ సాహితీవేత్త మల్లాది చంద్రశేఖరశాస్త్రికి ఈ ఏడాది రామినేని విశిష్ట పురస్కారం అందజేయనున్నట్లు రామినేని ఫౌండేషన్ కన్వీనర్, సినీనటుడు ఏవీఎస్ తెలిపారు. డాక్టర్ రామినేని అన్నయ్య చౌదరి జన్మదినం సందర్భంగా ఈ నెల 12న హైదరాబాదులో అవార్డులు అందజేయనున్నట్టు ఆయన తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఎంఎల్ నరసింహారావు, ప్రముఖ చిత్రకారుడు వైకుంఠం, సినీనటి పొత్తూరి సీతాదేవిలను కూడా ఈ ఏడాది రామినేని ఫౌండేషన్ పురస్కారాలతో సన్మానిస్తున్నట్టు ఏవీఎస్ వెల్లడించారు. అవార్డు ప్రదాన కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News