: భౌతిక శాస్త్రంలో 2013 నోబెల్ ప్రైజ్ ప్రకటన
భౌతిక శాస్త్రంలో 2013 సంవత్సరానికి నోబెల్ ప్రైజ్ ను ప్రకటించారు. బ్రిటన్ కు చెందిన పీటర్ హిగ్స్, బెల్జియంకు చెందిన ఫ్రాంకోయిస్ ఇంగ్లెర్ట్ కు ఈ పురస్కారాలను ప్రకటించారు. కణాలు ద్రవ్యరాశిని ఎలా పొందుతాయన్న విషయంపై వీరు చేసిన పరిశోధనలకు గాను వీరిద్దరినీ ఈ విశిష్ట పురస్కారానికి ఎంపిక చేశారు. వీరు నిర్వహించిన పరిశోధన హిగ్స్ బోసాన్ పేరిట పాప్యులర్ అయింది.