: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై సమైక్యాంధ్ర ఎఫెక్ట్


తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలపై సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా రోజుకు లక్షన్నర మందికి పైగా స్వామివారిని దర్శించుకునేవారు. అయితే, సీమాంధ్రలో ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతుండడం, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో భక్తులు ఈసారి తక్కువ సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. రోజుకు యాభై వేల మంది కూడా రావడంలేదని టీటీడీ ట్రస్టీ ఎన్.కన్నయ్య అంటున్నారు. మామూలుగా అయితే, వారాంతం, సెలవు దినాల్లో రోజుకు 90 వేల మంది వెంకన్న దర్శనార్థం వస్తుంటారని, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ సంఖ్య లక్షా యాభై వేలు దాటుతుందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News