: కర్నూలులో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి
కర్నూలులో ఏపీఎన్జీవోలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఆఫీసుల్లో ఉన్న సిబ్బందిని బయటకు పంపి కార్యాలయాలకు తాళాలు వేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ జేఏసీ నేతలు మాట్లాడుతూ... కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చేవరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే... ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతవుతుందని హెచ్చరించారు.