: ఏపీలో పరిస్థితులకు కాంగ్రెస్ దే బాధ్యత: రాజ్ నాథ్


రాష్ట్ర విభజన ప్రకటన, టీ నోట్ కు కేబినెట్ ఆమోదం అనంతరం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులకు బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. గతంలో తాము మూడు రాష్ట్రాలు ఇచ్చినా, ఎక్కడా సమస్యలు తలెత్తలేదని, ఎవరూ ఆందోళనలు చేయలేదని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము ముందు చెప్పినట్టుగానే తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అయితే, సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News