: ఆదివారం నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యటన
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు బంగ్లాదేశ్ లో ఆయన పర్యటన సాగుతుంది. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ప్రణబ్ ఈ విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట రైల్వే శాఖ సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదురి, సీనియర్ అధికారులు వెళతారు.
మూడు రోజుల పర్యటనలో బంగ్లా అధ్యక్షుడు జిల్లూర్ రహ్మన్, ప్రధాని షేక్ హసీనా, విపక్ష నేత ఖలేదా జియా తదితరులతో రాష్ట్రపతి భేటీ అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై వారితో చర్చిస్తారు.