: మిస్ యూనివర్స్ పై చెప్పుల కేసు


భారతదేశ పర్యటనలో ఉన్న విశ్వసుందరి ఒలీవియా కల్పోపై కేసు నమోదైంది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్లో... ఒక పాదరక్షల కంపెనీకి ఫోటో షూట్ చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన (ఆదివారం) సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. కేసు వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం ఒలీవియా, ఫ్యాషన్ డిజైనర్ సంజనా జాన్, మరికొందరు కలసి తాజ్ మహల్ ను సందర్శించారు. కొంత సమయం తర్వాత, మిస్ యూనివర్స్ ఒలీవియా ఒక బ్రాండెడ్ కంపెనీకి చెందిన చెప్పులను తీసుకుంది. అందులో ఒకటి వేసుకుని, మరొకటి చేతిలో పట్టుకుని పోజిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ లో తాజ్ మహల్ వచ్చేలా ఒలీవియా నిలుచుంది. ఈ స్టిల్ ను వారి గ్రూపులో ఉన్న ఒక వ్యక్తి క్లిక్ మనిపించాడు.

సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం, పురావస్తు శాఖ నియంత్రణలో ఉండే కట్టడాలలో వాణిజ్యపరమైన కార్యకలాపాలను నిర్వహించడం నిషిద్ధం. ఈ నిబంధన ప్రకారం విశ్వసుందరి ఒలీవియా ఒక బ్రాండెడ్ కంపెనీకి చేసిన ఫుట్ వేర్ ఫోటో షూట్ చట్ట రీత్యా నేరంగా పరిగణించబడుతుంది. దీంతో, ఆమెపై కేసు నమోదైంది. పురావస్తు శాఖ అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) తో పాటు టూరిజం పోలీసుల నిఘా వైఫల్యం కనపడుతోందని పురావస్తు శాఖ భావిస్తోంది. ప్రస్తుతం ఒలీవియా బాలికలు, మహిళల సాధికారత మరియు ఎయిడ్స్ పై చైతన్యం తెచ్చే కార్యక్రమంలో భాగంగా భారత్ లో పర్యటిస్తోంది.

  • Loading...

More Telugu News