: మల్లాది విష్ణుకు సమైక్యసెగ
ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సమైక్య సెగ తగిలింది. విజయవాడలో కోర్టు వద్దకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే విష్ణును న్యాయవాదులు అడ్డుకున్నారు. విభజనను అడ్డుకోవడం చేతకాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయవాదులు తక్షణం ఆయన వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు.