: క్రికెట్లో సచిన్ బేబీ సందడి!
క్రికెట్లో అదరగొడుతున్న కొత్త కుర్రాడి పేరు సచిన్ బేబీ. అలాగని ఈ అబ్బాయి మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి బంధువని అనుకోకండి. ఎందుకంటే ... మాస్టర్ కీ, ఈ కుర్రాడికీ పేరులోనే సంబంధం తప్ప... మరే సంబంధమూ లేదు.
సచిన్ బేబీ కేరళకు చెందిన కుర్రాడు. ఈ యువ ఆటగాడి ఆటతీరు ఆకట్టుకోవడంతో ఐపీఎల్ లో ఆడడానికి రాజస్థాన్ రాయల్స్ ఈ కుర్రాడిని తమ జట్టులోకి తీసుకుంది. ఎడమచేతి వాటం బ్యాట్స్ మేన్ అయిన సచిన్ బేబీ ఆఫ్ స్పిన్నర్ గా కూడా రాణిస్తున్నాడు. కేరళ రంజీ జట్టుకి వైస్ కెప్టెన్ గా కూడా సచిన్ వ్యవహరిస్తున్నాడు.