: రైల్వే ఆదాయం మస్తు మస్తు
భారతీయ రైల్వేల ఆదాయం దండిగా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) కాలంలో 65,354కోట్ల రూపాయల ఆదాయం వచ్చి పడింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ. 58,661కోట్ల కంటే ఇది 11.41శాతం అదనం. సరుకుల రవాణా ద్వారా వచ్చే ఆదాయం 9 శాతానికిపైగా పెరిగి రూ. 40,293కోట్ల నుంచి రూ. 44,191 కోట్లకు చేరుకుంది. ప్రయాణికుల ద్వారా ఆదాయం 15,582కోట్ల నుంచి 18,099కోట్లకు వృద్ధి చెందింది. ఇందులో 16 శాతం పెరుగుదల నమోదైంది.