: 'వీసా ఆన్ అరైవల్' ను మరో 40 దేశాలకు విస్తరించనున్న భారత్


భారీస్థాయిలో విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడానికి భారత్ కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 'వీసా ఆన్ అరైవల్' (మన దేశంలో అడుగుపెట్టిన వెంటనే వీసా జారీ చేస్తారు) ను మరో 40 దేశాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా వెల్లడించారు. మన దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న ఈ సమయంలో... విదేశీ టూరిస్టులను మరింత ఎక్కువగా ఆకట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దీని వల్ల మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు మరింతగా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. కొత్తగా 'వీసా ఆన్ అరైవల్' పథకాన్ని వర్తింపజేయనున్న దేశాల్లో... అమెరికా, బ్రిటన్, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూఏఈ, సౌదీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్వీడన్, ఐర్లండ్ లాంటి దేశాలున్నాయి. ప్రస్తుతం ఈ సౌకర్యం జపాన్, సింగపూర్, ఇండోనేషియా, లగ్జెంబర్గ్, న్యూజిలాండ్, కాంబోడియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, లావోస్, మయన్మార్ లాంటి దేశాలకు ఉంది.

ఇప్పటిదాకా 'వీసా ఆన్ అరైవల్'ను కేవలం ఢిల్లీ, చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్, బెంగళూరు, కోచి, ముంబై, తిరువనంతపురం ఎయిర్ పోర్టుల నుంచే పొందే వీలుంది. అయితే, ఇప్పుడు ఈ సదుపాయాన్ని గోవా, గయ, చండీగఢ్, అమృత్ సర్ లాంటి ఎయిర్ పోర్టులకూ విస్తరించనున్నారు.

  • Loading...

More Telugu News