: రాజీనామాపై ఢిల్లీ హైకోర్టుకెళ్లిన లగడపాటి రాజగోపాల్
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన రాజీనామా విషయంలో ఢిల్లీ హైకోర్టు తలుపుతట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనను వ్యతిరేకిస్తూ రెండు నెలల క్రితం తాను రాజీనామా చేశానని, అయినా స్పీకర్ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కనుక ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.