: సొంత నియోజకవర్గంలో ఎయిమ్స్ కు సోనియా శంకుస్థాపన
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన నియోజకవర్గం అయిన ఉత్తరప్రదేశ్ లోని రాయిబరేలీలో ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (ఎయిమ్స్) నిర్మాణానికి ఈ రోజు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. సోనియా వెంట కుమార్తె ప్రియాంక కూడా ఉన్నారు. అనంతరం సోనియా పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అగ్రికల్చర్ సైన్స్ సెంటర్ ను సందర్శించి టీసీఎస్ శిక్షణా కార్యక్రమాన్ని ఆరంభించారు. హడ్కో చేపట్టిన ఇళ్ల నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు.