: శేషజీవితాన్ని విశాఖలోనే గడిపేస్తాను: మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
తన శేషజీవితాన్ని సాగరతీరంలో ... విశాఖపట్నంలో గడపాలని వుందని ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అన్నారు. "విశాఖ నక్షత్రంలో పుట్టినందుకో... ఏమో కానీ ... ఈ నగరం అంటే నాకు ఎంతో ఇష్టం ... ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనసు ఎంతో ఉల్లాసంగా వుంటుంది. పిల్లలకు సంగీత పాఠాలు చెప్పుకుంటూ నా శేష జీవితాన్ని ఇక్కడే గడిపేస్తాను" అన్నారు బాలమురళీ.
తాను అనుభవంలో పెద్ద వాడినైనప్పటికీ, జ్ఞానంలో మాత్రం ఇంకా 'బాలు'డినేనని చమత్కరించారు. తాను విశాఖలో స్థిరపడేందుకు విజయ్ నిర్మాణ్ సంస్థ అధినేత విజయ్ కుమార్ అప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని బాలమురళీ చెప్పారు. శ్రీప్రకాశ్ విద్యానికేతన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి నిన్న ఆయన విశాఖ వచ్చారు.