: 185 కోట్లు పలికిన 118 క్యారెట్ల డైమండ్
అత్యంత అరుదైన 118.28 క్యారెట్ల తెల్లని డైమండ్ వేలంలో అత్యధిక ధర పలికింది. హాంకాంగ్ లో జరిగిన వేలంలో ఈ శ్వేత వజ్రం రూ. 185 కోట్లు (30 మిలియన్ డాలర్లు) పలికింది. సౌత్ బీస్ వేలంలో ఫోన్ ద్వారా ఓ వ్యక్తి ఈ డైమండ్ ను దక్కించుకున్నాడు. కోడిగుడ్డు ఆకారంలో ఉండే ఈ డైమండ్ ధర 28 నుంచి 35 మిలియన్ డాలర్లు పలుకుతుందని అంచనా వేశారు. 2011లో దక్షిణాఫ్రికా దేశంలోని లోతైన గనులలో ఈ డైమండ్ బయటపడింది. అప్పట్లో 299 క్యారెట్ల బరువున్న ఈ డైమండ్ కు అనంతరం ఓ ఆకారం కల్పించారు. గతేడాది జరిగిన వేలంలో రూ.160 కోట్లు (26.7 మిలియన్ డాలర్లు) ధర పలికిన 101.73 క్యారెట్ల డి కలర్ డైమండ్ ను ఇది అధిగమించడం విశేషం.