: రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుంది?: మంత్రి రాంరెడ్డి


తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ఎలా అవుతుందో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నిరూపించుకోవాని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సవాలు విసిరారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 21న ఖమ్మంలో జరిగే సమావేశానికి రేణుకను ఆహ్వానించే విషయాన్ని తెలంగాణ మంత్రుల కమిటీ నిర్ణయిస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే, విభజనపై ఆమె వైఖరి అర్థం కాని నేతలు ఆమెను జిల్లానుంచే పంపించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. జిల్లా కాంగ్రెస్ లో చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్న ఆమెకు ప్రాధాన్యమివ్వరాదని వారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News