: చిన్నప్పటి నుంచే బాలికలకు ఆత్మరక్షణ విద్య!


రోజు రోజుకీ పెరిగిపోతున్న బాలికలపై లైంగిక దాడులను అరికట్టే క్రమంలో, కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. చిన్నప్పటి నుంచే బాలికలకు ఆత్మరక్షణ విషయంలో శిక్షణ ఇవ్వవలసిన ఆవశ్యకతను కేంద్రం గుర్తించింది. ఆత్మరక్షణకు సంబంధించిన పద్ధతులను వ్యాయామ విద్యలో భాగం చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

ప్రాథమికోన్నత స్థాయిలోనే ఈ ఆత్మరక్షణ విద్యను ప్రవేశపెట్టాలని కేంద్రం ఆదేశించింది. ఇందులో భాగంగా అత్యవసర పరిస్థితులలో తమను తాము ఎలా రక్షించుకోవాలన్న అంశాలపై బాలికలకు శిక్షణ ఇస్తారు. కరాటే వంటి విద్యలను కూడా నేర్పుతారు. ఇదిలా ఉంచితే, మరోపక్క స్త్రీలపట్ల గౌరవ భావాన్ని పెంపొందించే అంశాలను పాఠ్యప్రణాళికలో చేర్చాల్సిన అవసరం వుందని యూనివర్శేటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది.          

  • Loading...

More Telugu News