: ఎనిమిది రోజుల్లో సిలిండర్ రాలేదా..? డీలర్ లైసెన్స్ ఊడినట్లే


బుక్ అయిన తర్వాత 8 రోజులైనా గ్యాస్ సిలిండర్ రాలేదా..? డీలర్ సర్వీసు బాలేదా..? అయితే, ఆ డీలర్ ను పీకి పారేయొచ్చు. సంస్కరణల్లో భాగంగా వినియోగదారుడు రారాజు కానున్నాడు. ఇందుకు వీలుగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. దీంతో డీలర్ల దందాకు, చెత్త సర్వీసుకు చెక్ పడనుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గోవాలో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టింది.

బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లోగా డీలర్లు సిలిండర్లను వినియోగదారులకు అందివ్వాల్సి ఉంటుంది. ఎనిమిది రోజులు దాటితే డీలర్ల రేటింగ్ తగ్గుతుందని, వారిపై చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ డైరెక్టర్ కెకె గుప్తా తెలిపారు.

5 స్టార్ రేటింగ్ అంటే 85 శాతం సిలిండర్లు 48 గంటల్లోపు డెలివరీ అవుతున్నట్లు. 4 స్టార్ అంటే నాలుగు రోజుల్లోపు డెలివరీ, 3 స్టార్ అంటే ఆరు రోజులు, 2 స్టార్ అంటే ఎనిమిది రోజుల్లోపు, 1స్టార్ అంటే డెలివరీకి ఎనిమిది రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకున్నట్లు అర్థం. ఇప్పటికే చమురు కంపెనీలు నచ్చిన కంపెనీకి గ్యాస్ కనెక్షన్ మార్చుకునేలా పోర్టబులిటీకి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News