: పోలీసులపై చిందులేసిన బాలీవుడ్ నటీమణి అరెస్ట్


మోడల్ నుంచి నటిగా అవతారమెత్తిన అంజుమ్ నాయర్ అనే బాలీవుడ్ తార అర్ధరాత్రి పోలీసులపై చిందులేసింది. ఆనక అరెస్టయింది. వివరాల్లోకెళితే.. ఆదివారం రాత్రి ముంబయిలోని అంధేరి ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం నుంచి హెచ్చు స్థాయిలో సంగీతం వినిపిస్తుండడంతో ఇరుగుపొరుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కానిస్టేబుళ్ళు ఆమె ఉంటున్న ఫ్లాట్ వద్దకు వచ్చారు. మ్యూజిక్ వాల్యూమ్ తగ్గించమని చెప్పిన పోలీసులపై ఆమె తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. ఈ సమయంలో ఆమె దుందుడుకు ప్రవర్తనను మరో పోలీసు వీడియో తీశాడు. ఈ నేపథ్యంలో అమ్మడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి అరెస్టు చేశారు. నేడు ఆమెను కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.

  • Loading...

More Telugu News