: మొబైల్ నుంచే పాస్ పోర్టుకు దరఖాస్తు
పాస్ పోర్టు కోసం కార్యాలయాల వరకూ వెళ్లి రోజంతా క్యూలో నుంచుని పడే అవస్థలకు ఇక కాలం చెల్లనుంది. ఎలాగంటారా.. మీ అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఎం-పాస్ పోర్టు యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని, దాని సాయంతో పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దాని ద్వారానే ఫీజు కూడా చెల్లించేయవచ్చు. ఈ సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ద్వారా పాస్ పోర్టు సమాచారం మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంది. నెలన్నర రోజులలో ఎం-పాస్ పోర్టు యాప్ ద్వారా సేవలను ప్రారంభించనున్నట్లు విదేశాంగ శాఖలో టెక్నాలజీ అధిపతిగా ఉన్న గోలక్ కుమార్ తెలిపారు. ఈ యాప్ ను టీసీఎస్ అభివృద్ధి చేసిందని, త్వరలోనే తమకు అప్పగించనుందని చెప్పారు.