: రాష్ట్రపతికి ధర్మాన లేఖ
రెండో ఎస్సార్సీని ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సమర్పించారు. సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో తన విచక్షణాధికారాలు ఉపయోగించి కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలావుంటే సమైక్యాంధ్ర కోరుతూ రెండు నెలల కిందటే ధర్మాన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.