: విజయనగరంలో గంట సేపు కర్ఫ్యూ సడలింపు


విజయనగరంలో ఆందోళనలు అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రజలు తమ నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే నిమిత్తం, ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. దీంతో ప్రజలు భారీ ఎత్తున రోడ్ల మీదకు వచ్చి వారికి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేశారు. మూడు రోజుల నుంచి కర్ఫ్యూ ఉండటంతో కూరగాయలు కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు బంకుల వద్ద జనం బారులు తీరారు. విజయనగరంలో అన్ని వస్తువుల రేట్లు మూడు రెట్లు పెరిగాయి. ఒక్కో పాల ప్యాకెట్ యాభై రూపాయలవరకు అమ్మారు.

అయితే, కేవలం గంటపాటే కర్ఫ్యూని సడలించడంతో... ఈ సమయం సరిపోలేదని విజయనగర వాసులు వాపోతున్నారు. ఈ సమయాన్ని మరికొంత సేపు పొడిగిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కర్ఫ్యూ సడలింపు సమయం అయిపోవడంతో... ప్రజలను వెంటనే ఇళ్లలోకి వెళ్లాలని పోలీసులు బలవంతం చేశారు.

  • Loading...

More Telugu News